లుక్ మార్చిన కొణిదెల నిహారిక
కొణిదెలవారి అమ్మాయి నిహారిక లుక్ మార్చేసింది. కొత్త లుక్ తో ఆకట్టుకుంటోంది. షార్ట్ హెయిర్ తో సరికొత్తగా కనిపిస్తోంది. తాజా లుక్ కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెలివిజన్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తన టాలెంట్ తో కెరీర్ ను నిర్మించుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత నిర్మాతగా కూడా మారింది.