'శరీరాన్ని తడిమేవాడు'.. చిన్ననాడు ఎదురైన వేధింపులను బయటపెట్టిన హీరోయిన్ కంగన
- ‘లాకప్’ షోలో చెప్పిన కంగన
- తమ గ్రామంలో ఓ వ్యక్తి అనుచితంగా తాకేవాడన్న హీరోయిన్
- అతడి ఉద్దేశం ఏంటో తనకు అప్పట్లో అర్థం కాలేదని వ్యాఖ్య
- తనలాంటి వారిని పిలిచి బట్టలు విప్పమని అడిగేవాడన్న కంగన
అనంతరం కంగనా రనౌత్ కూడా చిన్నప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. చిన్నారులతో కొందరు కామాంధులు అసభ్యంగా ప్రవర్తిస్తుంటారని, తనకు కూడా అలాంటి అనుభవం ఎదురైందని తెలిపింది.
తమ గ్రామంలో తన కంటే పెద్ద వాడైన ఓ వ్యక్తి తనను ఉద్దేశపూర్వకంగా అనుచితంగా తాకుతూ ఉండేవాడని తెలిపింది. ఆ సమయంలో అతడి ఉద్దేశం ఏంటో తనకు అర్థం కాలేదని చెప్పింది. తనలాంటి వారిని పిలిచి బట్టలు విప్పమని అడిగేవాడని, శరీరాన్ని తడుముతూ ఉండేవాడని తెలిపింది. ఆ సమయంలో తమ వయస్సు 6 ఏళ్లు మాత్రమేనని, దీంతో అతడి చేష్టలను తాము ఆపలేకపోయేవాళ్లమని చెప్పింది.