రంజాన్ వేళ హైదరాబాద్‌లోని పాతబస్తీలో 6 ప్రాంతాల్లో ఉచిత పార్కింగ్ సౌకర్యం
- చివరి 10-12 రోజులు మార్కెట్ మరింత రద్దీగా ఉండే అవకాశం
- చార్మినార్ సమీపంలోని యునానీ ఆసుపత్రి ప్రాంగణంలో పార్కింగ్
- కుడా స్టేడియం, మోతీగల్లీ పెన్షన్ ఆఫీసు, ముఫిదుల్లా నామ్ హైస్కూల్ లోనూ..
- పంచమొహల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ ఖాళీ స్థలంలో ఉచిత పార్కింగ్
చార్మినార్ సమీపంలోని యునానీ ఆసుపత్రి ప్రాంగణం, కుడా స్టేడియం, మోతీగల్లీ పెన్షన్ ఆఫీసు, కోట్ల అలీజాలోని ముఫిదుల్లా నామ్ హైస్కూల్ ప్రాంగణం, పంచమొహల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ ఖాళీ స్థలంలో సందర్శకులు ఉచితంగా వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని వాహనదారులకు సూచించారు.