రాజమౌళి గ్యారేజ్ లో చేరిన మరో కొత్త కారు.. అదిరిపోయే ఫీచర్లు!

Rajamouli Buys New Car has these features
  • వోల్వో ఎక్స్ సీ 40ని కొనుగోలు చేసిన డైరెక్టర్
  • తాళాలను అందజేసిన వోల్వో ప్రతినిధి
  • ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోను పోస్ట్ చేసిన సంస్థ
డైరెక్టర్ రాజమౌళి (కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి) కొత్త కారును కొనుగోలు చేశారు. తన గ్యారేజ్ లోకి వోల్వో ఎక్స్ సీ 40 ఎస్ యూవీని తీసుకొచ్చారు. వోల్వో కార్స్ ఇండియా ప్రతినిధి రాజమౌళికి కారు తాళాలను అందించారు. ఈ విషయాన్ని వోల్వో కార్స్ ఇండియా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో వెల్లడించింది. రాజమౌళికి కారును అందిస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది. 

గొప్ప దర్శకుడు, రచయిత రాజమౌళి గారికి వోల్వో ఫ్యామిలీలోకి స్వాగతమంటూ రాసుకొచ్చింది. ఆయన దృక్పథంలాగే సౌకర్యవంతమైన ప్రయాణాలు వారికి కలగాలని కోరుకుంటున్నామని పేర్కొంది. 

కాగా, రాజమౌళి కొనుగోలు చేసిన ఫ్యూజన్ రెడ్ కలర్ లో ఉన్న ఈ కారు ఖరీదు ఢిల్లీ ఎక్స్ షో రూం ప్రకారం రూ.44.50 లక్షలు. 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో కారుకు పవర్ నిచ్చారు. ఈ ఇంజన్ తో 187 బీహెచ్ పీ వద్ద 300 నానోమీటర్ల టార్క్ను జనరేట్ చేస్తుంది. 8 గేర్లుండడం విశేషం. డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉండడం మరో విశేషం. రాడార్ ఆధారిత సిటీ సేఫ్టీ, డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్, స్టీరింగ్ అసిస్ట్, వాహనాల మధ్య దూరాన్ని ఇండికేట్ చేసే అలర్ట్ వంటి అదిరిపోయే ఫీచర్లున్నాయి. కాగా, ఎక్స్ సీ 40లోనే ఎలక్ట్రిక్ వెర్షన్ నూ వోల్వో తీసుకొస్తోంది.
Go Back to Shorts
Rajamouli
Volvo
XC 40
Tollywood

More Telugu News