తుపాకీ చేత‌బ‌ట్టి... ల‌క్ష్యానికి గురి పెట్టిన అమిత్ షా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తుపాకీ చేత‌బ‌ట్టి... ల‌క్ష్యానికి గురి పెట్టిన అమిత్ షా

union home minister amit shah visits capt
  • సీఏపీటీని సంద‌ర్శించిన అమిత్ షా
  • అత్యాధునిక ఆయుధాల‌ను ప‌రిశీలించిన కేంద్ర మంత్రి
  • అక్క‌డే తుపాకీ చేత‌బ‌ట్టగా ఫొటో తీసిన మీడియా
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిజంగానే తుపాకీ చేత‌బ‌ట్టారు. అత్యాధునిక మెషీన్ గ‌న్‌ను చేతిలోకి తీసుకున్న ఆయ‌న అంత‌టితోనే ఆగ‌కుండా దానితో ల‌క్ష్యానికి గురి పెట్టేశారు. ఇలా అమిత్ షా తుపాకీ చేత‌బ‌ట్టుకుని టార్గెట్‌కు గురి పెట్టిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. నిజానికి అమిత్ షా క‌ద‌న రంగంలోకి ఏమీ దూక‌లేదు గానీ...క‌ద‌న రంగంలోకి దిగే మ‌న ఖాకీల కోసం రూపొందిస్తున్న అత్యాధునిక ఆయుధాల‌ను ప‌రిశీలించారు. 

శుక్ర‌వారం నాడు మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌దాని భోపాల్‌కు స‌మీపంలోని సెంట్ర‌ల్ అకాడెమీ ఫ‌ర్ పోలీస్ ట్రైనింగ్ (సీఏపీటీ)ని సంద‌ర్శించిన సంద‌ర్భంగా పోలీసుల కోసం రూపొందించిన అత్యాధునిక ఆయుధాల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న ఓ మెషీన్ గ‌న్‌ను చేత‌బ‌ట్టుకుని దానితో ల‌క్ష్యాన్ని గురి చూస్తున్న సంద‌ర్భంగా మీడియా కెమెరాలు క్లిక్‌మ‌న్నాయి.
CAPT
Bhopal
Amit Shah
BJP

More Telugu News