‘పుష్ప’ అవతారమెత్తిన రాజస్థాన్ బౌలర్ మెక్ కాయ్

Pushpa fever grips Rajasthan Royals Obed McCoy
  • కోల్ కతాతో మ్యాచ్ లో కనిపించిన దృశ్యం
  • షెల్డన్ జాక్సన్ వికెట్ తీసిన తర్వాత పుష్ప పోజు
  • చివరి ఓవర్లో రెండు వికెట్ల పతనంతో విజయం
క్రికెటర్లకు పుష్ప ఫీవర్ పట్టుకున్నట్టుంది. రవీంద్ర జడేజా సహా గతంలో పలువురు క్రికెటర్లు ‘పుష్ప’ సినిమాలోని అల్లు అర్జున్ క్యారక్టర్ మాదిరే హావభావాలు ప్రదర్శించడం చూశాం. తాజాగా రాజస్థాన్ బౌలర్ మెక్ కాయ్ కూడా ఇలానే చేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య సోమవారం జరిగిన ఉత్కంఠ పోరులో.. రాజస్థాన్ విజయం సాధించింది. ఈ విజయంలో మెక్ కాయ్ పాత్ర ఎంతో కీలకమని చెప్పుకోవాలి. ఎందుకంటే చివరి ఓవర్ వేసింది అతడే. 

అదే ఓవర్ లో అతడు తన తొలి వికెట్ తీశాడు. విజయానికి 11 పరుగులే కావాల్సిన దశలో.. కెప్టెన్ సంజు శామ్సన్ నమ్మకంతో మెక్ కాయ్ కు బౌలింగ్ ఇచ్చాడు. అతడు అదే ఓవర్ లో రెండు వికెట్లు పడగొట్టి, కట్టుదిట్టమైన బౌలింగ్ తో పరుగులు పారకుండా చేసి, విజయానికి దోహదపడ్డాడు. చివరి ఓవర్ లో మెక్ కాయ్ ముందుగా షెల్డన్ జాక్సన్ వికెట్ తీశాడు. ఆ వెంటనే చేయిని గడ్డం కింద నుంచి తిప్పుతూ పుష్ప పోజు ఇచ్చాడు. అంతేకాదు గెలుపు తర్వాత కూడా ఎదురుపడిన కెమెరాలకు పుష్ప కటింగ్ ఇచ్చాడు మెక్ కాయ్. 


Go Back to Shorts
Rajasthan Royals
McCoy
Pushpa

More Telugu News