Asaduddin Owaisi: ఒవైసీకి చేదు అనుభవం.. కాన్వాయ్ ను అడ్డుకున్న గుజరాత్ ముస్లింలు!

  • ఈ ఏడాది డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు
  • ఈ క్రమంలో అహ్మదాబాద్ కు వెళ్లిన ఒవైసీ
  • ఒవైసీ బీజేపీ ఏజెంట్ అంటూ అడ్డుకున్న ముస్లింలు
Gujarat Muslims blocked Owaisi convoy

ఎంఐఎం అధినేత ఒవైసీకి చేదు అనుభవం ఎదురైంది. ముస్లింల నుంచే ఆయన వ్యతిరేకతను చవిచూశారు. వివరాల్లోకి వెళ్తే, ఈ ఏడాది డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ కు ఒవైసీ వచ్చారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ లో ముస్లింలు ఒవైసీ కాన్వాయ్ కి నల్ల జెండాలను చూసిస్తూ అడ్డుకున్నారు. ఒవైసీ గోబ్యాక్, ఒవైసీ బీజేపీ ఏజెంట్ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ట్రాఫిక్ ఆగిపోయింది. అనంతరం ఎంఐఎం కార్యకర్తల సహాయంతో ఒవైసీ అక్కడి నుంచి ముందుకు సాగారు.

More Telugu News