Nani: పెద్దపల్లి జిల్లాలో నాని సినిమా షూటింగ్ సందడి

  • 'దసరా' చిత్రంలో నటిస్తున్న నాని
  • శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిత్రం
  • గోదావరిఖనిలో నాని, కీర్తిసురేశ్ లపై పాట చిత్రీకరణ
Nani Dasasra movie shooting in Peddapalli district

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'దసరా' చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా పెద్దపల్లి జిల్లాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. గోదావరిఖని ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. 

తాజా షెడ్యూల్ లో నాని, హీరోయిన్ కీర్తి సురేశ్ లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. సుమారు 500 మంది డ్యాన్సర్లతో భారీ ఎత్తున ఈ పాటను షూట్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

More Telugu News