Nani: గోదావరిఖనిలో నాని - కీర్తి సురేశ్ సందడి!

  • నాని తాజా  చిత్రంగా 'దసరా'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ
  • ఊర మాస్ లుక్ తో నాని
  • దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్   
Dasara movie upadate

నాని ఇటీవల కాలంలో సినిమా .. సినిమాకి తన లుక్ మార్చేస్తున్నాడు. 'శ్యామ్ సింగ రాయ్'లో చాలా డీసెంట్ గా కనిపించిన  ఆయన, ఆ తరువాత సినిమా అయిన 'అంటే .. సుందరానికీ'లో అమాయకంగా కనిపించనున్నాడు. ఇక 'దసరా' సినిమాలో ఆయన ఊరమాస్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సింగరేణి కోల్ మైన్స్ పరిధిలోని ఓ పల్లెటూరులో నడుస్తుంది. అందువలన నాని - కీర్తి సురేశ్ కాంబినేషన్లో గోదావరిఖని పరిసర ప్రాంతాల్లో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.

సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇంతకుముందు నాని -  కీర్తి సురేశ్ కాంబినేషన్లో వచ్చిన 'నేను  లోకల్' హిట్ కావడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News