Vidadala Rajini: సీఎం జగన్ సర్ ప్రైజ్ చేశారు... మంత్రి పదవిపై విడదల రజని స్పందన
ఏపీలో కొత్తగా 25 మందితో క్యాబినెట్ ఏర్పాటు చేయడం తెలిసిందే. తొలిసారి మంత్రి పదవి చేపట్టనున్న వారిలో విడదల రజని కూడా ఉన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే రజవి తనకు మంత్రి పదవి దక్కడంపై స్పందించారు. మంత్రి పదవి దక్కుతుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. సీఎం జగన్ సర్ ప్రైజ్ చేశారని తెలిపారు.
సీఎం జగన్ ఓ సాధారణ బీసీ మహిళనైన తనను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించారని, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారి ఎమ్మెల్యేనైన తనకు తాజాగా మంత్రి బాధ్యతలు అప్పగించారని, సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయనని రజని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే నడుస్తానని రజని ఉద్ఘాటించారు. ప్రతి అంశంలోనూ తనను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.