జగన్ ఢిల్లీ టూర్ దేని కోసం?.. ట్విట్టర్‌లో పోల్ పెట్టిన నారా లోకేశ్
- నాలుగు అంశాలను ప్రస్తావించిన లోకేశ్
- పేలని జగన్ హస్తిన పయనమెందుకంటూ ట్యాగ్
- వైరల్‌గా లోకేశ్ ట్వీట్ పోల్
పేలని జ గన్ హస్తిన పయనమెందుకు? పేరిట లోకేశ్ సంధించిన ఈ పోల్‌లో తొలి అంశంగా 'బాబాయి హత్య కేసులో దొరికిపోయిన అవినాశ్ రెడ్డిని తప్పించేందుకు' అని పెట్టారు. రెండో అంశంగా 'తాను కొట్టేస్తే కాగ్ పట్టేసిన రూ.48 వేల కోట్ల వ్యవహారాన్ని కామప్ చేసేందుకు' అని పేర్కొన్నారు. ఇక మూడో అంశంగా తనపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తును ఆపేయాలని అని పేర్కొన్నారు. నాలుగో అంశంగా లక్ష కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలని అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పోల్ ఇప్పుడు వైరల్ గా మారింది.