ప్రభాస్ .. మారుతి సినిమాకి ముహూర్తం ఖాయమైనట్టే!

Prabhas in Maruthi Movie
  • షూటింగు దశలో 'సలార్'
  • సెట్స్ పైకి వెళ్లిన 'ప్రాజెక్టు K'
  • మారుతి కథకు గ్రీన్ సిగ్నల్ 
  • ఈ నెల 10న పూజా కార్యక్రమాలు  
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి ఒక సినిమా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనే టాక్ వచ్చింది. ఒక వైపున ప్రభాస్ చేస్తున్న 'సలార్' .. మరో వైపున 'ప్రాజెక్టు K' సెట్స్ పై ఉన్నాయి. ఇంకో వైపున 'స్పిరిట్' సినిమాను ప్రభాస్ ఒప్పుకుని ఉన్నాడు.

అందువలన ప్రభాస్ ఇప్పట్లో మారుతి సినిమాను చేయకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇది మారుతి మార్కు కామెడీ టచ్ తో కూడిన మాస్ యాక్షన్ మూవీ అని అంటున్నారు. ఓ మీడియం బడ్జెట్ సినిమాను .. త్వరగా పూర్తయ్యే సినిమాను చేయాలనే ఉద్దేశంతోనే ప్రభాస్ ఈ సినిమాను ఒప్పుకున్నాడని అంటున్నారు. 

'బాహుబలి' సినిమా చేసినప్పటి నుంచి ప్రభాస్ నుంచి ఒక్కో సినిమా రావడానికి ఏళ్లకు ఏళ్ల సమయం పట్టేస్తోంది. ఆయన వందల కోట్ల బడ్జెట్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడనీ, తెలుగు నేటివిటీకి దూరంగా వెళుతున్నాడనే టాక్ ఉంది. అందువల్లనే ప్రభాస్ మారుతి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉంటారని సమాచారం.
Go Back to Shorts
Prabhas
Krithi Shetty
Malavika Mohanan
Maruthi Movie

More Telugu News