డ్రగ్స్ కేసులో పలుకుబడి ఉన్నవాళ్ల పేర్లు తొలగిస్తున్నారు... డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం కార్యకర్తలు
- పుడింగ్ అండ్ మింక్ పబ్ పై పోలీసుల దాడులు
- అనేకమందిని అదుపులోకి తీసుకుని వదిలేసిన వైనం
- డీజీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లే యత్నం చేసిన యువ మోర్చా
ఈ సందర్భంగా బీజేవైఎం శ్రేణులు లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. బీజేవైఎం కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఓ దశలో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి నాంపల్లి పీఎస్ కు తరలించారు.