'బీస్ట్' సాంగ్ జోరు మామూలుగా లేదే!
- భారీ యాక్షన్ మూవీగా 'బీస్ట్'
- విజయ్ సరసన నాయికగా పూజ హెగ్డే
- సంగీత దర్శకుడిగా అనిరుధ్
- ఈ నెల 13వ తేదీన విడుదల
ఈ సినిమా నుంచి కొన్ని రోజుల క్రితం 'అరబిక్ కుతూ' సాంగ్ ను రిలీజ్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ పాట వ్యూస్ పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తూ వెళుతోంది. తాజాగా ఈ పాట 250 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. ఈ తరహాలో పాటను డిజైన్ చేయడానికి మిగతా వాళ్లంతా కసరత్తు చేసేలా ఈ పాట ప్రభావితం చేసింది.
తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ నెల 13వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇంతకుముందు విజయ్ చేసిన 'మాస్టర్' ను మించిన ఓపెనింగ్స్ తో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అంటున్నారు. అభిమానుల అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి మరి.