దక్షిణాది సినిమాలపై రాశీఖన్నా విమర్శలు
- ఇంతకాలం దక్షిణాది రొటీన్ ఫార్ములాకు అలవాటు పడ్డాను
- హీరో పక్కన కాసేపు కనిపించడం, ఆ తర్వాత వెళ్లిపోవడం దక్షిణాదిలో రొటీన్
- ఇకపై కథల ఎంపికలో కొత్తదనం ఉంటుందన్న రాశి
అయితే, హిందీలో అవకాశాలు వస్తుండటంతో... ఇంతవరకు ఆదుకున్న దక్షిణాది పరిశ్రమపై సంచలన కామెంట్లు చేస్తోంది. సౌత్ సినిమాలు చేస్తున్నంత కాలం రొటీన్ ఫార్ములాకు అలవాటు పడ్డానని చెప్పింది. తనకు రొటీన్ పాత్రలు చేయడం ఇష్టం ఉండదని... హీరోల పక్కన కాసేపు కనిపించడం, ఆ తర్వాత పక్కకు వెళ్లిపోవడం దక్షిణాదిలో రొటీన్ అని తెలిపింది. టాలీవుడ్ ఈ ఫార్ములాను సృష్టించిందని, తాను కూడా అందులో పడిపోయానని చెప్పింది. ఇకపై తన కథల ఎంపికలో కొత్తదనం ఉంటుందని తెలిపింది. ప్రతి సినిమాలో తనను కొత్తగా చూస్తారని చెప్పింది.