నెల్లూరు జిల్లాలో దారుణం.. పట్టపగలు పదిమందీ చూస్తుండగానే మహిళపై అత్యాచారం
- నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఘటన
- కాపాడాలంటూ మహిళ కేకలు వేస్తున్నా ముందుకు రాని జనం
- ఫిర్యాదు అందకున్నా దర్యాప్తు చేస్తామన్న పోలీసులు
అతడి చెర నుంచి తప్పించుకునేందుకు ఆమె కేకలు వేసింది. చుట్టుపక్కల పశువులు కాస్తున్న కొందరు అక్కడే ఉన్నా అతడి బారి నుంచి ఆమెను రక్షించేందుకు ముందుకు రాలేదు. ఈ లోపు విషయం తెలుసుకున్న నిందితుడి భార్య అక్కడికి చేరుకుని అడ్డుకోవడంతో బాధితురాలు తప్పించుకుంది. గతంలోనూ ఇక్కడ పశువులు మేపేందుకు వెళ్లిన మహిళలపై అఘాయిత్యాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాగా, తాజా ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినప్పటికీ దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.