పుడమి తల్లిపై కోహ్లీ ప్రేమ ఎలాంటిదో చెప్పే ఫొటో ఇది!
- ధరిత్రిపై భావోద్వేగ ట్వీట్ చేసిన కోహ్లీ
- భూమికీ ఓ సంగీతం ఉంటుందన్న క్రికెటర్
- వినాలనుకునే వారికే వినిపిస్తుందని కామెంట్
అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకంటారా?. తన ట్విట్టర్ ఖాతాలో కాసేపటి క్రితం తనే స్వయంగా పోస్ట్ చేసిన ఓ ఫొటోతో ఈ చర్చను జనాల మదిలో కోహ్లీనే రగిల్చాడు. భూమాతపై తనకున్న గౌరవాన్ని, ప్రేమను వెల్లడిస్తూ ఆ ఫొటోను కోహ్లీ పోస్ట్ చేశాడు. పచ్చిక బయలుపై ప్రశాంత వదనంతో అలా వెల్లకిలా నిర్మలంగా పడుకుండిపోయిన తన ఫొటోను పోస్ట్ చేసిన అతడు.. దానికి ఓ కామెంట్ కూడా పెట్టాడు. భూమికీ ఓ సంగీతం ఉందని చెప్పాడు. భూమికి ఉన్న సంగీతం.. దానిని వినాలనుకునే వారికే వినిపిస్తుందని అతడు ఆసక్తి రేకెత్తించే కామెంట్ పోస్ట్ చేశాడు.