పాక్ భూభాగంపైకి దూసుకుపోయిన భారత క్షిపణి ఘటనపై అమెరికా స్పందన!
- మార్చి 9వ తేదీన పాక్ భూభాగంపై పడిన మిస్సైల్
- ఈ ఘటన పొరపాటుగానే జరిగిందని చెప్పిన అమెరికా
- భారత్ కూడా వివరణ ఇచ్చిందని వ్యాఖ్య
మార్చి 9న ఈ ఘటన సంభవించిన సంగతి తెలిసిందే. ఒక క్షిపణికి సాధారణ తనిఖీలను నిర్వహిస్తున్న సమయంలో ప్రమదవశాత్తు అది గాల్లోకి లేచింది. దూసుకెళ్లి పాకిస్థాన్ భూభాగంపై పడింది. అయితే దానికి వార్ హెడ్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేయగా... భారత రక్షణశాఖ వివరణ ఇచ్చింది. జరిగిన ఘటనపై విచారణ వ్యక్తం చేసింది. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఇప్పటికే ఆదేశించామని చెప్పింది.