గాయ‌ప‌డ్డ సైనికులతో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు.. వీడియో వైరల్!

ukraine president Volodymyr Zelenskyy visited hospital where injured soldiers are in treatment
  • గాయ‌ప‌డ్డ సైనికుల‌కు జెలెన్ స్కీ ప‌రామ‌ర్శ‌
  • సైనికులకు అందుతున్న చికిత్స‌‌పై ఆరా 
  • సైనికుల‌లో ధైర్యం నూరిపోసైన వైనం  
  • బెడ్‌పై ఉన్న సైనికుడితో సెల్ఫీ దిగిన అధ్య‌క్షుడు
అణ్వ‌యుధాలు క‌లిగి ఉండ‌ట‌మే కాకుండా ఆర్థికంగా, సైనిక స‌త్తా ప‌రంగా కూడా ప్ర‌పంచంలోనే శ‌క్తిమంత‌మైన దేశంగా కొన‌సాగుతున్న ర‌ష్యాను అతి చిన్న దేశం ఉక్రెయిన్ ముప్పు తిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఓ వైపు వంద‌లు, వేల మంది సైనిక ప‌టాలాన్ని ర‌ష్యా రంగంలోకి దించుతున్నా..ఉక్రెయిన్ ఇసుమంత కూడా బ‌య‌ప‌డ‌టం లేదు.

అంతేకాదు, త‌మ ప‌రిధిలోకి వ‌చ్చిన ర‌ష్యా సైనికుల‌కు ఉక్రెయిన్ ఆర్మీ చుక్క‌లు చూపిస్తోంది. ఈ త‌ర‌హాలో ఉక్రెయిన్ సైన్యం స‌త్తా చాటుతుండ‌టానికి ఆ దేశ అధ్య‌క్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీనే కార‌ణ‌మ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అందుకు నిద‌ర్శ‌నంగా అంత‌ర్జాతీయ మీడియా పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారిపోయింది. 

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దండెత్తి రాగానే.. మామూలుగా అయితే ఉక్రెయిన్‌లాంటి చిన్న దేశం వ‌ణికిపోవాలి. అందుకు విరుద్ధంగా ర‌ష్యా సేనల‌ను నిలువ‌రించి మ‌రీ ఉక్రెయిన్ సైన్యం స‌త్తా చాటుతోంది. ఈ క్ర‌మంలో యుద్ధం మొద‌లైన రెండో రోజే సైనిక దుస్తుల్లోకి మారిపోయిన జెలెన్‌స్కీ.. క‌ద‌న రంగంలోని సైనికుల వ‌ద్ద‌కు వెళ్లారు. 

తాజాగా యుద్ధంతో గాయాల‌పాలై ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న సైనికుల ప‌రామ‌ర్శ‌కు జెలెన్ స్కీ వెళ్లారు. ఈ సంద‌ర్భంగా సైనికుల‌కు ధైర్యం నూరిపోయ‌డంతో పాటుగా వారితో స‌ర‌దాగా సెల్ఫీలు దిగారు. సైనికులకు అందుతున్న చికిత్స‌‌పై అక్క‌డి వైద్య సిబ్బందిని ఆరా తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
Go Back to Shorts
Ukraine
Russia
Volodymyr Zelenskyy
Ukraine Army

More Telugu News