టిల్లు నమ్మలేదు గానీ.. మీరు నమ్మారు: డీజే టిల్లు హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
- రాధికను అక్కున చేర్చుకున్నారు
- డీజే టిల్లును సక్సెస్ చేసిన అందరికీ కృతజ్ఞతలు
- మీ ప్రేమాభిమానాలు లేకుంటే సాధ్యమయ్యేది కాదని కామెంట్
తాజాగా, హీరోయిన్ నేహా శెట్టి స్పందించింది. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘రాధికను టిల్లు నమ్మలేదు. కానీ, మీరు నమ్మారు. మీరంతా రాధికను అక్కున చేర్చుకున్నారు. మీ అందరినీ రాధిక కూడా ప్రేమిస్తుంది. డీజే టిల్లును అంతటి సక్సెస్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమాభిమానాలు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. ప్రతి అడుగు చిరస్మరణీయమయ్యేలా ప్రతి రోజూ ప్రయత్నిస్తానని మాటిస్తున్నా’’ అని ఆమె ట్వీట్ చేసింది.