Punjab]: పంజాబ్ పోలీసు శాఖ కీల‌క నిర్ణ‌యం.. 122 మంది నేత‌ల‌కు భ‌ద్ర‌త‌ ర‌ద్దు

punjab withdrawn security over 122 politicians
షార్ట్స్‌లో చూడండి
సామాన్యుల పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) పాల‌న ప్రారంభం కాక‌ముందే పంజాబ్‌లో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు జ‌రిగిపోతున్నాయి. పంజాబ్ పోలీసు శాఖ శుక్ర‌వారం నాడు జారీ చేసిన ఆదేశాల ప్ర‌కారం ఆ రాష్ట్రానికి చెందిన 122 మంది కీల‌క రాజ‌కీయ నేత‌ల‌కు భ‌ద్ర‌త ర‌ద్దు అయిపోయింది. ఇలా సెక్యూరిటీ ర‌ద్దు అయిన నేత‌ల్లో మాజీ మంత్రులు స‌హా మాజీ ఎమ్మెల్యేలు, ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

 ఈ మేర‌కు ఆ రాష్ట్ర అడిష‌న‌ల్ డీజీ (సెక్యూరిటీ) శుక్ర‌వారం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న భగవంత్ మాన్ రాష్ట్ర డీజీపీ వీకే భావ్రాను కలిసిన కొద్దిసేపటికే ఇలా భద్రతను ఉపసంహరిస్తూ ప్రకటన రావడం గమనార్హం. ఇక ఈ నెల 16న సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న భ‌గ‌వంత్ మాన్ సింగ్ ముందుముందు ఇంకెలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటారో చూడాలి.
Go Back to Shorts
Punjab]
AAP
Bhagavanth Mann Singh
Punjab Police

More Telugu News