ఈ ఫొటోలో ఉన్న సినీ ప్రముఖుడు ఎవరో గుర్తుపట్టగలరా...?
- ఇటీవల సినిమాల్లో కనిపించని పరుచూరి
- పరుచూరి నివాసానికి వెళ్లిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ
- వృద్ధాప్యంతో చిక్కిపోయిన స్థితిలో పరుచూరి
- విచారం వ్యక్తం చేస్తున్న అభిమానులు
దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఇటీవల పరుచూరి నివాసానికి వెళ్లారు. వృద్ధాప్యంతో ఉన్న పరుచూరిని చూసి విచారం వ్యక్తం చేశారు. శరీరం చిక్కి శల్యమైనప్పటికీ ఆయన ఆలోచనల్లో ఇంకా పదును తగ్గకపోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముడతలు పడిన దేహంతో ఉన్న పరుచూరి ఫొటోను జయంత్ సి పరాన్జీ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆ ఫొటోను చూసి అభిమానులు అయ్యో... పరుచూరి ఇలా అయిపోయారేంటి? అని బాధపడుతున్నారు.
.