ఉక్రెయిన్ రాజధానిలోకి రష్యా బలగాల ఎంట్రీ
- కీవ్ స్వాధీనం కోసం ఇప్పటికే యత్నాలు
- ప్రతిఘటించి అడ్డుకున్న ఉక్రెయిన్ బలగాలు
- ఎట్టకేలకు కీవ్‌ను చుట్టిముట్టి ఎంట్రీ ఇచ్చేసిన రష్యా
- భీకర కాల్పులతో ముందుకు సాగుతున్న వైనం
ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాలను ఇప్పటికే తన స్వాధీనంలోకి తీసుకున్న రష్యా బలగాలు..వాటికంటే ముందుగానే కీవ్‌ను తమ వశం చేసుకోవాలని భావించాయి. అయితే ఉక్రెయిన్ సేనలతో పాటు ఆ దేశ సాధారణ పౌరులు కూడా రష్యా బలగాలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి వారిని అడ్డుకున్నారు.
గడచిన కొన్ని రోజులుగా కీవ్ నగరాన్ని నలుదిశలా చుట్టేసిన రష్యా బలగాలు శుక్రవారం సాయంత్రం కీవ్ నగరంలోకి ఎంట్రీ ఇచ్చేశాయి. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లోనే కీవ్ నగరాన్నిరష్యా సేనలు తమ స్వాధీనంలోకి తీసుకునే అవకాశాలున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.