ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికలు.. మరో ఎన్నికకు రంగం సిద్ధం
- 6 రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
- 21న నోటిఫికేషన్, అదే రోజు నుంచి నామినేషన్లు
- 24వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
- 31న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు
దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు సోమవారం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.. అసోంలో 2, హిమాచల్ ప్రదేశ్ లో 1, కేరళలో 3, నాగాలాండ్ లో 1, త్రిపురలో 1, పంజాబ్‌లో 5 రాజ్యసభ స్థానాలు.. ఇలా మొత్తం 13 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్‌లో ఖాళీ కానున్న నేపథ్యంలో వీటిని ఆ లోగానే భర్తీ చేసేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 21న నోటిఫికేషన్ జారీ కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. మార్చి 24న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మార్చి 31న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగనుంది.