ప్రధానమంత్రి మోదీ లక్ష్యం ఏమిటో చెప్పిన ఉండవల్లి
- దేశంలో మళ్లీ బ్రిటిష్ రోజులు రాబోతున్నాయి
- దేశం నుంచి మధ్యతరగతి అవుట్
- ప్రతిపక్షాలు బలహీనపడితే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది
ప్రతిపక్షాలు బలహీనపడితే దేశంతో ప్రజాస్వామ్యం చచ్చిపోతుందన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ మోదీని కాదనలేని పరిస్థితిలో ఉన్నాయన్నారు. ప్రజలంతా ఒక్కటై ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఓటేస్తారన్న భయం ఉంటే ఏ పార్టీ అయినా భయపడుతుందని కానీ దేశంలో ఎక్కడా ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. ఇదే సభకు హాజరైన ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేశం కష్టపడి నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.