మొహాలీ టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట... టీమిండియాదే పైచేయి
- మొహాలీలో టీమిండియా, శ్రీలంక తొలిటెస్టు
- తొలి ఇన్నింగ్స్ లో 574-8 వద్ద డిక్లేర్ చేసిన భారత్
- లంక టాపార్డర్ ను దెబ్బతీసిన టీమిండియా బౌలర్లు
- ఆట చివరికి 4 వికెట్లకు 108 పరుగులు చేసిన లంక
కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు శ్రీలంక ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది. లంక బ్యాటింగ్ తీరు చూస్తుంటే టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం కనిపించడంలేదనిపిస్తోంది. అదే జరిగితే, కోహ్లీ తన 100వ టెస్టులో సెంచరీ ఆశలు వదులుకోవాల్సిందే. తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ 45 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.