సల్మాన్ ఖాన్ తో పెళ్లి అంటూ ఓ ఫొటో వైరల్ అవుతుండడంపై సోనాక్షి సిన్హా స్పందన
- సల్మాన్, సోనాక్షి చిరునవ్వుల ఫొటో
- సోనాక్షి వేలికి ఉంగరం తొడుగుతున్న సల్మాన్
- అది ఫేక్ ఫొటో అని తేలిన వైనం
- ఆ మాత్రం తెలుసుకోలేరా? అంటూ సోనాక్షి వ్యాఖ్యలు
"మీరేమైనా వెర్రివాళ్లా? మార్ఫింగ్ చేసిన ఫొటోకి, నిజమైన ఫొటోకి తేడా ఏంటో చెప్పలేరా? ఆ మాత్రం తెలుసుకోలేకుండా ఉన్నారా?" అంటూ కాస్తంత అసహనం ప్రదర్శించింది.
బాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ వేత్త శత్రుఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి దబాంగ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో హీరో సల్మాన్ ఖానే. ఇక, సోనాక్షి ప్రస్తుతం డబుల్ ఎక్స్ఎల్ అనే చిత్రంలో నటిస్తోంది. సల్మాన్ ఖాన్ టైగర్-3లో నటిస్తున్నారు.