Corona Virus: ఏపీలో కొత్త‌గా 253 క‌రోనా కేసులు.. ఇద్ద‌రి మృతి

ap corona updates
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 19,432 కరోనా పరీక్షలు నిర్వహించగా, 253 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 40 కేసులు నమోదు కాగా, తూర్పు గోదావ‌రి జిల్లాలో 39, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 37 కేసులు గుర్తించారు. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక‌ పాజిటివ్ కేసు నమోదైంది.

అదే సమయంలో 635 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,16,964 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,97,065 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,181 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,718కి పెరిగింది.
Go Back to Shorts
Corona Virus
ap

More Telugu News