రెండో వాంగ్మూలం తర్వాత నాకు భద్రత కావాలనిపిస్తోంది: వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరి
- వివేకా కారుడ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి
- అప్రూవర్ గా మారిన వైనం
- తాజా వాంగ్మూలంతో మరింత కలకలం
- తనకు ప్రాణభయం ఉందన్న దస్తగిరి
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తనకు ప్రాణభయం వుందని ఆందోళన వ్యక్తం చేశాడు. రక్షణ కల్పించాలని ఎస్పీని, సీబీఐ అధికారులను కోరానని తెలిపాడు. తనకు, తన కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. తన కుటుంబ సభ్యుల కోసమే ఈ కేసులో అప్రూవర్ గా మారానని వెల్లడించాడు. అప్రూవర్ గా మారడంలో తనపై ఇతరుల ప్రలోభాలు లేవని దస్తగిరి స్పష్టం చేశాడు.