కోహ్లీపై ప్రశంసలు కురిపించిన యువరాజ్ సింగ్
- ఎంతో అంకితభావం కలిగిన క్రికెటర్ అంటూ కితాబు
- దిగ్గజ ఆటగాడిగా ఎదిగాడని ప్రశంస
- యువతకు స్ఫూర్తి ప్రదాతవని కితాబు
ఒక కుర్రాడిగా నెట్ సెషన్ లో భారత దిగ్గజ క్రికెటర్లతో కలిసి నడిచావని... రాబోయే తరాలకు మార్గం చూపుతూ ఇప్పుడు నువ్వొక లెజెండ్ గా మారావని కితాబునిచ్చాడు. ఏదో ఒక రోజు బ్లూ జెర్సీ ధరించాలని కలలు కనే యువతకు స్ఫూర్తిప్రదాతగా నిలిచావని అన్నాడు. నువ్వొక దిగ్గజ సారధివని ప్రశంసించాడు.
ఆట పట్ల నీలో ఉన్న అగ్నిని అలాగే రగిలిస్తూ ఉంచాలని సూచించాడు. జట్టులో సహచర ఆటగాడిగానే కాకుండా... ఒక స్నేహితుడిగా మన మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పడం తనకు సంతోషంగా ఉందని చెప్పాడు. పరుగులు చేయడం, కప్ లను సొంతం చేసుకోవడం, పంజాబీ పాటలను వినడం.. ఇలా అన్నీ ప్రత్యేకమైనవేనని తెలిపాడు.