'సెబాస్టియన్ పీసీ 524' నుంచి 'హేలి' సాంగ్ విడుదల.. హ్యాట్రిక్ కు సిద్ధమవుతున్న కిరణ్ అబ్బవరం

Heli song released from Kiran Abbavaram movie Sebastian PC 524
  • కిరణ్ సరసన నటించిన కోమలీ ప్రసాద్, నువేక్ష
  • దర్శకత్వం వహించిన బాలాజీ సయ్యపురెడ్డి
  • రేచీకటి కథాంశంగా తెరకెక్కిన చిత్రం
'రాజావారు రాణిగారు' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.

తాజాగా 'సెబాస్టియన్ పీసీ 524' చిత్రంతో హ్యాట్రిక్ ను అందుకోవడానికి ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలాజీ సయ్యపురెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా... జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్టైన్ మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి, జయచంద్రారెడ్డి, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్ మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.

ఈరోజు ఈ చిత్రంలోని 'హేలి' సాంగ్ ను విడుదల చేశారు. హీరోకి, హీరోయిన్ కు మధ్య సాగే ప్రేమగీతం ఇది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదల అవుతున్నాయి. రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశంగా తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Go Back to Shorts
Kiran Abbavaram
Tollywood
Sebastuab PC 524

More Telugu News