ఈ నెల 21 నుంచి జనసేన సభ్యత్వ నమోదు... విజయవంతం చేయాలన్న పవన్ కల్యాణ్
- పార్టీ క్షేత్రస్థాయి పటిష్ఠత కోసం పవన్ చర్యలు
- మరోసారి క్రియాశీలక సభ్యత్వాల నమోదు
- ప్రకటన చేసిన పవన్ కల్యాణ్
2020 సంవత్సరం సెప్టెంబరు మాసంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించినట్టు తెలిపారు. లక్షమందికి పైగా పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారని వివరించారు. ప్రమాదాలకు గురవుతున్న యువ జనసైనికుల కోసం బీమా సౌకర్యం కూడా తీసుకువచ్చామని, ఈ బీమా పథకం ప్రీమియం కోసం రూ.1 కోటి మేర నిధిని అందజేసినట్టు పవన్ వెల్లడించారు.