ఆస్కార్-2022 అవార్డులకు నామినేషన్లు ప్రకటించిన నిర్వాహకులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆస్కార్-2022 అవార్డులకు నామినేషన్లు ప్రకటించిన నిర్వాహకులు

Oscar nominations revealed
  • ఆస్కార్ పండుగ దిశగా మరో ఘట్టం
  • తుది జాబితాలు ప్రకటించిన ఆస్కార్ నిర్వాహకులు
  • 12 విభాగాల్లో నామినేట్ అయిన ద పవర్ ఆఫ్ ద డాగ్
  • ఉత్తమనటుడి రేసులో డెంజెల్ వాషింగ్టన్, విల్ స్మిత్
  • ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేట్ అయిన స్టీవెన్ స్టీల్ బర్గ్
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించేందుకు ఆస్కార్ అవార్డుల ఉత్సవం త్వరలోనే జరగనుంది. ఆస్కార్-2022 నామినేషన్లను నేడు వెల్లడించారు. ద పవర్ ఆఫ్ ద డాగ్ చిత్రం ఏకంగా 12 విభాగాలకు నామినేట్ అయింది. విల్ స్మిత్, డెంజెల్ వాషింగ్టన్ వంటి అగ్రనటులు బెస్ట్ యాక్టర్ రేసులో ఉన్నారు. సీనియర్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేట్ అయ్యారు.

వివిధ విభాగాలకు ఖరారైన నామినేషన్ల వివరాలను నటి ట్రేసీ ఎల్లిస్ రాస్, కమెడియన్ లెస్లీ జోర్డాన్ మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం మార్చి 27న లాస్ ఏంజెలిస్ లోని డాల్బీ థియేటర్ లో నిర్వహించనున్నారు.

ముఖ్యమైన విభాగాల్లో నామినేషన్లు ఇవిగో..

ఉత్తమ చిత్రం
  • ద పవర్ ఆఫ్ ద డాగ్
  • బెల్ ఫాస్ట్
  • కోడా
  • డోంట్ లుక్ అప్
  • డూన్
  • నైట్ మేర్ అల్లీ
  • వెస్ట్ సైడ్ స్టోరీ
  • లికోరైస్ పిజ్జా
  • డ్రైవ్ మై కార్
  • కింగ్ రిచర్డ్

ఉత్తమ నటుడు
  • బెనెడిక్ట్ కంబర్ బాచ్ (ద పవర్ ఆఫ్ ద డాగ్)
  • డెంజెల్ వాషింగ్టన్ (ద ట్రాజెడీ ఆఫ్ మాక్ బెత్)
  • జేవియర్ బార్డెమ్ (బీయింగ్ ద రికార్డోస్)
  • విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)
  • ఆండ్రూ గార్ ఫీల్డ్ (టిక్, టిక్... బూమ్)

ఉత్తమ దర్శకుడు
  • జేన్ కాంపియన్ (ద పవర్ ఆఫ్ ద డాగ్)
  • పాల్ థామస్ ఆండర్సన్ (లికోరైస్ పిజ్జా)
  • స్టీవెన్ స్పీల్ బెర్గ్ (వెస్ట్ సైడ్ స్టోరీ)
  • ర్యుసుకే హమగుచి (డ్రైవ్ మై కార్)
  • కెన్నెత్ బ్రనా (బెల్ ఫాస్ట్)

ఉత్తమ నటి
  • పెనెలోప్ క్రజ్ (పారలల్ మదర్స్)
  • క్రిస్టెన్ స్టీవార్ట్ (స్పెన్సర్)
  • జెస్సికా చాస్టెయిన్ (ద ఐస్ ఆఫ్ టామీ ఫాయే)
  • నికోల్ కిడ్ మాన్ (బీయింగ్ ద రికార్డోస్)
  • ఒలీవియా కోల్మన్ (ద లాస్ట్ డాటర్)




Oscars-2022
Nominations
Hollywood
Awards

More Telugu News