పెళ్లి బృందానికి ప్రమాదం అత్యంత శోచనీయం: పవన్ కల్యాణ్
- అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది చనిపోవడం కలచి వేస్తోంది
- ఒకే కుటుంబంలోని ఐదుగురు మరణించడం మరింత బాధాకరం
- మృతుల కుటుంబాలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా
బళ్లారిలో బిడ్డకు కన్యాదానం చేసి స్వగ్రామానికి కారులో వెళ్తున్న బీజేపీ నాయకుడు కోకా వెంకటప్ప నాయుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించడం మరింత బాధాకరమని చెప్పారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని... మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.