Andhra Pradesh: ఏపీలో ఒక్కరోజులో 1800కి  పైగా కరోనా కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!

AP Corona Statistics and daily report
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 36,452 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,831 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 467 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 295, కృష్ణా జిల్లాలో 190, గుంటూరు జిల్లాలో 164, అనంతపురం జిల్లాలో 161 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 40 కేసులను గుర్తించారు.

అదే సమయంలో 242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,84,674 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,62,974 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 7,195 మందికి చికిత్స జరుగుతోంది. ఇప్పటివరకు 14,505 మంది కరోనాతో మరణించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Statistics
Daily Report

More Telugu News