అల్లు అర్జున్ పై జాన్వీ కపూర్ ప్రశంసలు!

Janvi Kapoor praises Allu Arjun
  • ఘన విజయం సాధించిన అల్లు అర్జున్ 'పుష్ప'
  • బాలీవుడ్ లో సైతం మంచి వసూళ్లు 
  • కూలెస్ట్ మేన్ ఆఫ్ ది వరల్డ్ అంటూ పుష్ప గెటప్ పై కామెంట్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో విడుదలైన 'పుష్ప' సినిమా ఘన విజయం సాధించింది. బన్నీ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది. బాలీవుడ్ లో సైతం హిందీ సినిమాలతో పోటీ పడి ఈ సినిమా వసూళ్లను సాధించింది. బాక్సాఫీస్ వద్ద మోత మోగించిన ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలయింది.

దీంతో, థియేటర్లలో ఈ సినిమాను చూడలేని సెలబ్రిటీలు ప్రస్తుతం ఓటీటీలో చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాను చూసిన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అద్భుతంగా ఉందని కితాబునిచ్చింది. 'పుష్ప' ఫొటోను షేర్ చేస్తూ 'ప్రపంచంలోనే అత్యంత కూల్ మేన్' అని వ్యాఖ్యానించింది. మైండ్ బ్లోయింగ్ మూవీ అని కొనియాడింది.
Go Back to Shorts
Allu Arjun
Pushpa
Janvi Kapoor
Bollywood

More Telugu News