Mahesh Babu: థ్యాంక్యూ వెరీ మ‌చ్ మ‌హేశ్ బాబు గారూ: అల్లు అర్జున్

Thank you very much  urstrulyMahesh  garu allu arjun
షార్ట్స్‌లో చూడండి
బాక్సాఫీస్ వ‌ద్ద‌ 'పుష్ప' జోరు ఇప్ప‌టికీ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌న్న విష‌యం తెలిసిందే.  హీరో అల్లు అర్జున్, ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'పుష్ప' గ‌త‌ నెల 17న‌ విడుద‌లైంది. విభిన్న క‌థతో వ‌చ్చిన‌ ఈ సినిమాపైనా, అల్లు అర్జున్ అభినయంపైనా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కూడా చేరాడు. తాజాగా, ఆయ‌న పుష్ప సినిమా చూసి, ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమా అద్భుతంగా ఉందని, ఇదో సంచ‌ల‌నం అని మ‌హేశ్ బాబు కొనియాడారు. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న‌ను తాను మ‌రోసారి నిరూపించుకున్నాడ‌ని అన్నారు. ఇక దేవిశ్రీ ప్ర‌సాద్ ప్ర‌సాద్ గురించి కొత్తగా చెప్ప‌డానికి ఏముంద‌ని, ఆయ‌నో రాక్ స్టార్ అని మ‌హేశ్ ప్రశంసించారు. ఇదో గొప్ప సినిమా అని, ఈ సినిమా బృందానికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

మ‌హేశ్ చేసిన ట్వీట్‌పై అల్లు అర్జున్ స్పందిస్తూ ఆయ‌న‌కు థ్యాంక్స్ చెప్పాడు. 'థ్యాంక్యూ వెరీ మ‌చ్ మ‌హేశ్ బాబు గారూ.. పుష్ప సినిమా బృందం అంద‌రి ప‌ని తీరును మీరు మెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా హృద‌యాల‌ను గెలుచుకున్న అభినంద‌న' అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. 
Go Back to Shorts
Mahesh Babu
Allu Arjun
Tollywood

More Telugu News