త్వరలోనే ఏఆర్ రెహమాన్ కుమార్తె వివాహం... వరుడు ఎవరంటే..!

AR Rahman daughter Khatija engagement with Riyasdeen
  • డిసెంబరు 29న ఖతీజా నిశ్చితార్థం
  • ఖతీజా రెహమాన్ పెద్ద కుమార్తె
  • రియాసిద్దీన్ తో నిశ్చితార్థం
  • కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య కార్యక్రమం
స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఇంట్లో త్వరలోనే పెళ్లి సందడి చోటుచేసుకోనుంది. రెహమాన్ కుమార్తె ఖతీజా నిశ్చితార్థం డిసెంబరు 29న ఘనంగా జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిశ్చితార్థం ఫొటోలను ఖతీజా సోషల్ మీడియాలో పంచుకుంది.


ఇక, ఖతీజా మనువాడబోయే వ్యక్తి పేరు రియాసిద్దీన్ షేక్ మహ్మద్. ఇంజినీరింగ్ పట్టభద్రుడైన రియాసిద్దీన్ కూడా సంగీత రంగంతో సంబంధం ఉన్నవాడే. సినీ, వినోద రంగంలో లైవ్ సౌండ్ ఇంజనీర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఖతీజా గతంలో 'రోబో' చిత్రంలో ఓ పాట కూడా పాడింది. రోబో చిత్రానికి రెహమానే సంగీతం అందించారు. డిసెంబరు 29న ఖతీజా పుట్టినరోజు కాగా, అదే రోజున నిశ్చితార్థం జరిగింది. ఖతీజా, రియాసిద్దీన్ ల పెళ్లికి ఇంకా ముహూర్తం నిర్ణయించలేదు. కాగా, రెహమాన్ కు ఖతీజా, రహీమా అనే కుమార్తెలతో పాటు అమీన్ అనే కుమారుడు కూడా ఉన్నారు.
Go Back to Shorts
Khatija Rahman
Riyasdeen
Engagement
AR Rahman
Wedding

More Telugu News