రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ ఎస్సై దుర్మరణం.. వారం రోజుల క్రితమే వివాహం
- ఒడిబియ్యం కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
- ఆటోను బలంగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- ప్రమాదంలో ఆయన తండ్రి కూడా మృతి
కార్యక్రమం పూర్తయిన అనంతరం నిన్న తండ్రితో కలిసి తిరిగి హైదరాబాద్‌కు ఆటోలో బయలుదేరారు. చింతపల్లి మండలం పోలెపల్లి రాంనగర్ వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటోను హైదరాబాద్ నుంచి దేవరకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.