ఈ లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేయించండి: రాష్ట్రాలకు కేంద్రం సూచన
- దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- 20 వేలు దాటిన రోజువారీ కేసులు
- ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన, రుచి కోల్పోవడం, అలసట, విరేచనాలతో బాధపడుతుంటే కనుక వారికి కరోనా సోకినట్టు భావించాలని... వారికి వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించాలని సూచించింది. ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు కూడా సూచించింది. ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని హితవు పలికింది.