'అతడు'కి సీక్వెల్ మాదిరిగా ఉంటుందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అతడు'కి సీక్వెల్ మాదిరిగా ఉంటుందట!

Mahesh Babu in Trivikram Movie
  • దుబాయ్ లో ఉన్న మహేశ్ బాబు 
  • రాగానే 'సర్కారువారి పాట' షూట్ 
  • ఆ తరువాత త్రివిక్రమ్ తో సెట్స్ పైకి 
  • ఈ కాంబినేషన్లో మూడో సినిమా    
త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టుగా కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అతడు' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. మోకాలు సర్జరీ చేయించుకున్న మహేశ్ బాబు కోలుకోగానే, మళ్లీ ఇద్దరూ కలిసి సినిమా చేయనున్నారనే విషయం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రాధాకృష్ణతో కలిసి సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించనున్నాడని చెప్పారు. అయితే కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు కేన్సిల్ అయినట్టుగా వార్తలు షికారు చేస్తున్న నేపథ్యంలో, త్రివిక్రమ్ .. తమన్ .. నాగవంశీ వెళ్లి, దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్న మహేశ్ ను కలిసి ఊహాగానాలకు తెరదించేశారు.

ఇక మహేశ్ తో త్రివిక్రమ్ చేయనున్న మూడో సినిమా కథ .. 'అతడు' సినిమాకి దగ్గరగానే ఉంటుందని అంటున్నారు. యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ. 'అతడు'కి సీక్వెల్ మాదిరిగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. 'సర్కారువారి పాట' షూటింగు పూర్తి కాగానే, త్రివిక్రమ్ తో కలిసి మహేశ్ సెట్స్ పైకి వెళ్లడానికి లైన్ క్లియర్ గానే ఉందన్న మాట.
Mahesh Babu
Trivikram Srinivas
Thaman

More Telugu News