TikTok: గూగుల్ ను వెనక్కి నెట్టేసిన టిక్ టాక్.. పాప్యులారిటీలో నంబర్ 1

TikTok dethrones Google to become most popular website
షార్ట్స్‌లో చూడండి
టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ ను.. పొట్టి వీడియోల (షార్ట్ వీడియోస్) సామాజిక మాధ్యమ యాప్ టిక్ టాక్ వెనక్కి నెట్టేసింది. 2021 సంవత్సరానికి అత్యంత పాప్యులర్ వెబ్ సైట్ (యాప్) గా నిలిచినట్టు ఐటీ సెక్యూరిటీ కంపెనీ క్లౌడ్ ఫ్లేర్ ప్రకటించింది. టిక్ టాక్ ఈ ఏడాది అత్యధిక హిట్స్ ను సంపాదించిందని తెలిపింది.

ఈ యాప్ ను కేంద్ర ప్రభుత్వం 2020లో భద్రతకు ముప్పు అంటూ నిషేధించడం తెలిసిందే. అంతకుముందు వరకు ఇది మన దేశంలోనూ ఎక్కువ మంది యూజర్లతో శరవేగంగా దూసుకుపోయింది. ‘‘ర్యాంకుల పరంగా ఫిబ్రవరిలో టిక్ టాక్ నంబర్ 1 స్థానానికి చేరుకుంది. మార్చి, జూన్ లోనూ మొదటి స్థానంలో నిలిచింది. తిరిగి ఆగస్ట్ నుంచి హిట్స్ పరంగా మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది’’ అని క్లౌడ్ ఫ్లేర్ తెలిపింది.

2020లో హిట్స్ పరంగా గూగుల్ మొదటి స్థానంలో ఉండగా, టిక్ టాక్, అమెజాన్, యాపిల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్ టాప్ 10లో నిలిచాయి. చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ కు చెందినదే టిక్ టాక్. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఈ సంస్థకు ఉన్నారు. అంతేకాదు ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.
Go Back to Shorts
TikTok
no 1
google
hits]

More Telugu News