Sharmila: దీక్షలతో, ధర్నాలతో తెలంగాణ స‌ర్కారు డ్రామాలు: ష‌ర్మిల‌

sharmila slams kcr
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ధాన్యం కొనుగోళ్ల విష‌యంపై స‌ర్కారు డ్రామాలు ఆడుతోంద‌ని ఆమె అన్నారు.
 
'రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలతో, ధర్నాలతో డ్రామాలు చేస్తుంటే, మాకు ఏ దిక్కూ లేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంట పండక, పెట్టుబడి రాక, అప్పులు తట్టుకోలేక పురుగుల మందు తాగి రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు చనిపోతున్నా కనీసం ఆ కుటుంబాలను ఓదార్చాలనే సోయి కూడా లేదు దొరగారికి' అంటూ వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు.

'ఢిల్లీలో రైతులు చనిపోతే ఆదుకోవడానికి లక్షల రూపాయ‌లు ఇచ్చే కేసీఆర్ గారికి మన రైతులు చనిపోతే పట్టించుకోవడానికి కనీసం టైం కూడా లేదు. రైతులు చనిపోయేలా చేస్తున్న రైతు హంతక ప్రభుత్వం మీది. రైతును అప్పులపాలు చేస్తున్న ముఖ్యమంత్రి మనకొద్దు. రైతు ఆవేదన తీర్చలేని ముఖ్యమంత్రి మనకొద్దు' అని ఆమె పేర్కొన్నారు.
Go Back to Shorts
Sharmila
YSRTP
Telangana

More Telugu News