"పుష్ప... పుష్పరాజ్... తగ్గేదే లే!" అంటూ డైలాగ్ చెప్పిన రవీంద్ర జడేజా
- ఈ నెల 17న పుష్ప రిలీజ్
- పాన్ ఇండియా చిత్రంగా గుర్తింపు
- బాగా పాప్యులర్ అయిన 'తగ్గేదే లే' డైలాగ్
- జడేజా తాజా వీడియో వైరల్
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నోట కూడా ఈ డైలాగ్ వినిపించింది. "పుష్ప... పుష్పరాజ్... తగ్గేదే లే!" అంటూ జడేజా అదిరిపోయేలా డైలాగ్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జడేజా టైమింగ్ కు బన్నీ ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. జడేజా డైలాగ్ చెప్పిన వీడియోను పుష్ప యూనిట్ ట్విట్టర్ లో పంచుకుంది.