Andhra Pradesh: ఏపీలో కొత్తగా 135 మందికి కరోనా పాజిటివ్

AP Corona Daily Report
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. ఇటీవల 100కి లోపే వచ్చిన కొత్త కేసులు మళ్లీ ఊపందుకున్నాయి. గడచిన 24 గంటల్లో 31,158 శాంపిల్స్ పరీక్షించగా, 135 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 35, కృష్ణా జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి. ప్రకాశం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,76,212 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,60,400 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,326 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించినవారి సంఖ్య 14,486కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Report
Today Cases

More Telugu News