ఎడ్లు, గుర్రం, కోడి పందేలకు అనుమతిని ఇవ్వండి: జగన్ కు ముద్రగడ లేఖ
- సంక్రాంతి, ఉగాది పండుగల సమయాల్లో ఆటలకు అనుమతి ఇవ్వాలి
- ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు
- పండుగ సమయాల్లో జనాలు జైలుకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు
అయితే, పండుగ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఇబ్బందులు పెట్టడం, ఆ తర్వాత చివర్లో అనుమతిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఐదు రోజుల పాటు అన్ని ఆటలకు పూర్తి స్థాయిలో అనుమతులను ఇవ్వాలని, పండుగల సంతోష సమయాల్లో జనాలను జైలుకు తీసుకెళ్లే పరిస్థితి ఉండకూడదని సీఎంను ముద్రగడ కోరారు.