బిగ్ బాస్ సీజన్-5 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ప్రారంభం

Bigg Boss grand finale event starts
  • ముగింపు దశకు చేరుకున్న బిగ్ బాస్-5
  • నేడు ఫైనల్స్
  • కాసేపట్లో విజేత ఎవరో తేలనున్న వైనం
  • 104 రోజులకు పైగా అలరించిన రియాలిటీ షో
తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-5 నేటితో ముగియనుంది. స్టార్ మా చానల్లో కొద్దిసేపటి క్రితం గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున మాంచి హుషారెత్తించే పాటలతో ఎంట్రీ ఇవ్వగా, ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కూడా గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కు విచ్చేశారు. స్టేజిపై సినీ గీతాలకు నర్తిస్తూ అందరినీ అలరించారు.

ఈ సందర్భంగా నాగార్జున... ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో మాట్లాడి, విన్నర్ ఎవరంటూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో లోబో మాట్లాడుతూ, తన భార్య కవలలకు జన్మనిచ్చిందని, తాను ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నానని తెలిపాడు.

ప్రియాంక స్పందిస్తూ, తాను చాన్నాళ్ల తర్వాత తన స్వగ్రామం వెళ్లి తండ్రిని కలిశానని వెల్లడించింది. కుటుంబ సభ్యులు తనను స్వాగతించిన తీరు మర్చిపోలేనని, పైగా తనకు ఇప్పుడు చాలా సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలిపింది.
Go Back to Shorts
Bigg Boss-5
Grand Finale
Event
Nagarjuna
Star Maa

More Telugu News