బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ?

Who is Big Boss Telugu season 5 winner
  • బిగ్ బాస్ విన్నర్ సన్నీ అంటూ వార్తలు
  • 34 శాతం ఓట్లతో తొలి స్థానంలో ఉన్న సన్నీ
  • 7 శాతం ఓట్లతో చివరి స్థానంలో సిరి
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది. రేపటితో ఈ రియాల్టీ షో ముగియనుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరో రేపు తెలిసిపోతుంది. మరోవైపు ఈ సీజన్ విన్నర్ ఎవరుకావచ్చనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. వీజే సన్నీ, శ్రీరామచంద్ర, షన్ముఖ్ జశ్వంత్, మానస్, సిరిలు ఫైనల్స్ వరకు వచ్చారు. వీరందరూ ప్రేక్షకులను అలరించడానికి తమ వంతుగా బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక ప్రేక్షకులు వేసే ఓట్లతో వీరిలో ఒకరు విన్నర్ గా నిలవనున్నారు.

మరోవైపు ఈ సీజన్ విన్నర్ ఎవరనే దానిపై ఒక వార్త వైరల్ అవుతోంది. ఇది ఎంత వరకు నిజమో కానీ... ఈ సీజన్ విన్నర్ సన్నీ అనేది ఆ వార్త సారాంశం. ఓటింగ్ లో 34 శాతం ఓట్లతో సన్నీ తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో షన్ముఖ్ (31), శ్రీరామచంద్ర (20), మానస్ (8), సిరి (7) ఉన్నారు. అయితే ఈ ఓటింగ్ ఫలితాలు నిజమా? కాదా? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.
Go Back to Shorts
Telugu
Big Boss 5
Winner
Sunny

More Telugu News