కేర‌ళ‌లో కొత్తగా 3,377 క‌రోనా కేసులు

corona bulletin in inida
  • దేశంలో కొత్త‌గా 6,984 క‌రోనా కేసులు
  • 247 మ‌ర‌ణాలు
  • మృతుల సంఖ్య మొత్తం 4,76,135
  • 1,34,61,14,483 డోసుల వ్యాక్సిన్ల వినియోగం
దేశంలో కొత్త‌గా 6,984 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వాటిలో కేర‌ళ‌లో న‌మోదైన క‌రోనా కేసులే 3,377 ఉన్నాయ‌ని వివ‌రించింది. దేశంలో నిన్న‌ 8,168 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. అలాగే, 247 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

కేర‌ళ‌లో నిన్న 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 87,562 మంది ఆసుప‌త్రులు, హోంక్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,41,46,931 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య‌ 4,76,135గా న‌మోద‌యింది. దేశంలో మొత్తం 1,34,61,14,483 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News