'ప్రాజెక్టు K' విషయంలో అది పుకారేనట!
- నాగ్ అశ్విన్ దర్శకుడిగా 'ప్రాజెక్టు K'
- నాయకా నాయికలుగా ప్రభాస్, దీపిక
- మిక్కీ జె మేయర్ ని తప్పించినట్టు ప్రచారం
- స్వయంగా ఖండించిన మిక్కీ
ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్ ను తీసుకుంటున్నట్టుగా ఆ మధ్య దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పాడు. 'మహానటి' సినిమాకి గాను మిక్కీ జె మేయర్ కి మంచి పేరు వచ్చింది. అయితే ఇంతవరకూ భారీ బడ్జెట్ సినిమాలకు మిక్కీ పనిచేయలేదు. అలాంటిది ప్రభాస్ సినిమా కోసం ఆయనను తీసుకోవడం కొంతమందిని ఆశ్చర్యపరిచింది.
ఈ ప్రాజెక్టు నుంచి మిక్కీని తప్పించారనే ప్రచారం ఇటీవల జరిగింది. అంతా కూడా నిజమేనేమో అనుకున్నారు. కానీ అదంతా పుకారేనని తేలిపోయింది. 'శ్యామ్ సింగ రాయ్' ప్రమోషన్స్ లో మాట్లాడిన ఆయన, తాను చేయనున్న సినిమాల జాబితాలో 'ప్రాజెక్టు K' ఉన్నట్టుగా చెప్పాడు. త్వరలో సంగీత చర్చలు మొదలవుతాయనీ .. ఆ సమయం కోసం వెయిట్ చేస్తున్నానని అన్నాడు.